30 నుంచి జగన్‌ సమైక్య శంఖారావం యాత్ర

హైదరాబాద్, 23 నవంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న కుప్పం నుంచి ప్రారంభించాల్సిన సమైక్య శంఖారావం బస్సు యాత్రను 30వ తేదీకి మార్చినట్లు అధికార‌ ప్రతినిధి గట్టు రామచంద్రరావు శనివారం తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విషయం తెలిపారు. ఈ నెల 26, 27 తేదీలలో తుపాను బాధిత ప్రాంతాలలో ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. తుపాను ప్రాంతాలలో పర్యటన కారణంగా సమైక్య శంఖారావం వాయిదా వేసినట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనాయకుల మద్దతు కూడగట్టే క్రమంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి శని, ఆది, సోమవారాల్లో ఢిల్లీ, భువనేశ్వర్, ముంబైలలో పర్యటిస్తున్నారని తెలిపారు.

Back to Top