20న నగరి నుంచి జగన్ సమైక్య శంఖారావం

హైదరాబాద్ :

ఈ నెల 20వ తేదీన చిత్తూరు జిల్లా నగరి నుంచి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర పునఃప్రారంభమవుతుంది. శ్రీ జగన్‌కు మెడనొప్పి తగ్గకపోవడంతో సమైక్య శంఖారావం యాత్ర మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచించారు. మెడ నొప్పి కారణంగా ఇప్పటికే ఆయన తన యాత్రను ఈ నెల 18కి వాయిదా వేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ జగన్మోహన్‌రెడ్డిని పరీక్షించిన అపోలో ఆసుపత్రి వైద్యులు మరో రెండు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు.

ఈ నెల 20న ఉదయం శ్రీ వైయస్ జగ‌న్ హైదరాబా‌ద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి వెళ్లి నగరి నియోజకవర్గంలో సమైక్య శంఖారావం యాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురా‌మ్ తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top