పాలమూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమీక్ష

హైదరాబాద్ :

మహబూ‌బ్‌నగర్ జిల్లా నేతలతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. లోటస్‌పాండ్లో జరిగిన ఈ సమీక్షా సమావేశం‌ సందర్భంగా పాలమూరు జిల్లాలో పార్టీ పరిస్థితి, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై‌ శ్రీ జగన్ చర్చించారు.‌ పాలమూరు జిల్లా పార్టీని మరింతగా బలీయంగా చేయడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని శ్రీ జగన్ ‌పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

'కలసి ఉంటేనే కలదు సుఖ'మని, మూడు ప్రాంతాల అభివృద్ధికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కృషిచేస్తుందని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి పాలమూరు జిల్లా నేతలతో తెలిపినట్లు సమాచారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు మహబూ‌బ్‌నగర్‌ జిల్లా నాయకులు, కార్యకర్తలు, వైయస్ అభిమానులు, సమైక్యవాదులు సిద్ధమని పార్టీ మహబూ‌బ్‌నగర్ జిల్లా నేతలు తెలిపారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీని జిల్లాలో గడపగడపకూ తీసుకెళ్తామన్నారు. సమై‌క్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్‌ జిల్లా నాయకులు స్పష్టం చేశారు.

జగన్‌తో ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధుల భేటీ:
వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు సోమవారం కలుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీ జగన్ చేస్తున్న కృషికి సంఘీభావం తెలిపారు. ఈ నెల 26న హైదరాబా‌ద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. పి.ఎం. రవికుమార్‌బాబు రూపొందించిన ‘సమైక్య శంఖారావం’ సీడీని శ్రీ జగన్ విడుదల చేశారు. ఎం.ప్రసాదరాజు, బి.వెంకటనారాయణరెడ్డి, పి.మద‌న్‌మోహన్‌రెడ్డి, సీహెచ్.దొరబాబు, ఎన్.పూర్ణచంద్రారెడ్డి, ప్రకాష్‌చంద్రారెడ్డి, సి.లోకేష్‌రెడ్డి, జయకృష్ణారెడ్డి, మురళీరెడ్డి తదితరులు శ్రీ జగన్‌ను కలిశారు.

Back to Top