సమైక్యానికి మద్దతివ్వండి: జయకు జగన్ వినతి

చెన్నై :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్న కేంద్రం చర్యలను అడ్డుకోవాలని తమిళనాడు సీఎం జయలలితకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆయన కోరారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బుధవారంనాడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా శ్రీ జగన్ జయలలితతో భేటీ అయ్యారు.

ప్రజావ్యతిరేక చర్యకు‌ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోందని ఈ సందర్భంగా శ్రీ జగన్ ఆరోపించారు. అంతకు‌ ముందు చెన్నై విమానాశ్రయంలో దిగిన శ్రీ జగన్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ జగన్‌ వాహన శ్రేణి ప్రయాణించే రహదారి అంతా పూలవర్షం కురిపించారు. టపాకాయలు కాల్చి వైయస్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top