ప్రత్యేకహోదా మన శ్వాస

గుంటూరు: జిల్లాలోని నల్లపాడు రోడ్డులో యువభేరి వేదికలో వైయస్ జగన్ ప్రసంగించారు. ప్రత్యేకహోదాపై విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....

  • ఎన్ని అడ్డంకులు పెట్టినా మా శ్వాస ప్రత్యేక హోదా, మా హక్కు ప్రత్యేక హోదా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యువభేరికి హాజరైన ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెమ్మకు పేరు పేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు.
  •  
  • ప్రత్యేక హోదా సాధన కోసం మనమంతా ఏకమయ్యాం.. మామూలుగా ఎక్కడైనా దేశం కోసం త్యాగాలు చేస్తే వారిని స్వాతంత్ర్య సమరయోధులు అంటాం. రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే వారిని అమరజీవులు అంటాం. ఇక్కడున్న ప్రతి చెల్లెమ్మ కోసం.. ప్రతి తమ్ముడి కోసం.. త్యాగాలు చేసే వాళ్లు తల్లిదండ్రులంటాం... 

  • దేశానికి స్వాతంత్ర్యం 1947, ఆగస్టు 15న వచ్చింది . అప్పుడు జనాభ 33కోట్లు. ఇప్పుడు దాదాపు 130 కోట్లు. అప్పటితో పోల్చితే.. మన ఆధాయాలు మారాయి. అప్పటితో పోల్చితే ఆహార ధాన్యాల ఉత్పత్తి మారింది. విద్యత్‌ వినియోగంలో కూడా మార్పులు వచ్చాయి. అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఏ అంశాన్ని చూసినా 70 ఏళ్ల కాలంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన తమ్ముళ్లకు.. చెల్లెమ్మలు కొన్ని విషయాలు ఆలోచించాలని కోరుతున్నాం..

  • మామూలుగా ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా, ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుందనేది మనం ఆలోచించుకోవాలి. మొన్నటికంటే నిన్న... నిన్నటికంటే నేడు.. నేటికంటే రేపు బాగుండాలని కోరుకుంటుంటారు. ఎకనామిక్స్‌ పరంగా దీన్ని సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటారు. దీని అర్థం.. ఇంతకు ముందుకు సాధించిన అభివృద్ధిని కాపాడుకుంటూ ఇకపై మరింత ప్రగతి సాధించమని.

  • ఉదాహరణకు ఒక కుటుంబాన్ని తీసుకుంటే తాతకంటే తండ్రి,.. తండ్రి కంటే కొడుకు.. అమ్మమ్మలకంటే అమ్మ... అమ్మకంటే కూతరు ఇంకా ఎక్కువ చదువుకోవాలి. వారి ఆర్థిక పరిస్థితి.. నివసించే ఇళ్లు క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఇవన్నీ మెరుగుపడాలి.. దీన్ని సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటారు. 

  • అందరి చేతుల్లో ఇప్పుడు 3జీ, 4జీమొబైల్స్‌ కనిపిస్తాయి.. 40 ఏళ్ల కిందట మీ తల్లిదండ్రుల చిన్నతనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పట్లో గ్రామాలకు కూడా టెలిఫోన్‌లు లేవు. ఇంట్లో ఫోన్‌ ఉంటే చాలా సంపన్న కుటుంబంగా భావించే పరిస్థితి. ట్రంకాల్‌ బుక్‌ చేస్తే మరుసటి రోజు కనెక్ట్‌ అయ్యే పరిస్థితి. బైక్‌లు, కార్లు చాలా అరుదుగా కనిపించే పరిస్థితి. కరెంటు ఉన్న ఇళ్లు దేవుడెరుగు కరెంటు లేని ఇళ్లు కనిపించే పరిస్థితి. ..
  • టీవీ చూడటానికి ఊరంతా ఒక్కచోట ఏకమయ్యేవారు. ఎవరో ఒక్క ఇంట్లో మాత్రమే టీవీ ఉండేది... వారింటికి వెళ్లి టీవీ చూసే పరిస్థితి. అక్కడ కూడా దూరదర్శన్‌ చూసే పరిస్థితి. మేడలంటే తెలియని గ్రామాలు అనేకం కనిపించేవి.

  •  ప్రభుత్వ బడుల్లో కూడా పిల్లల్ని చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు అగచాట్లు పడుతున్న పరిస్థితులు అనేకం కనిపించేవి. కారు కొనుగోలు చేయడం కథ దేవుడెరుగు... ట్యాక్సీల్లో పోవడం కూడా చాలా గొప్ప విషయంలో అనిపించే రోజులవి. కడుపు మాడ్చుకొని తమ కనీస అవసరాలను కూడా త్యాగం చేసి.. పైసలను లెక్కబెట్టి, మిగిల్చి పిల్లల్ని చదివించిన మహానుభావులు మనందరి తల్లిదండ్రులు. వారు ఉన్న ఇంటిని వారు పెరిగిన వాతావరణాన్ని, గతాన్ని ఒక్కసారి అడిగి చూడండి. మీ పెద్ద చదువుల వెనుక పెద్ద మనసులు ఉన్నాయి. ఆ పెద్ద మనస్సులు చేసిన పెద్ద త్యాగాల వల్ల ఇవాళ మనమంతా ఈ స్థానంలో ఉన్నాం.. మన తల్లిదండ్రులకు సెల్యూట్‌ చేస్తూ యువభేరి సదస్సును ప్రారంభిస్తున్నా.
Back to Top