జగన్‌కు దళిత క్రిస్టియన్ అసోసియేష‌న్ మద్దతు

హైదరాబాద్:

వైయస్ఆర్‌సీపీకి మద్దతిస్తున్నట్లు దక్షిణ భారత దళిత క్రిస్టియన్ అసోసియేష‌న్ ప్రకటించింది. దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేరుస్తానని శ్రీ వైయస్‌ జగన్ ప్రకటించిన‌ నేపథ్యంలో అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దళిత క్రైస్తవులకు వైయస్ఆర్‌సీపీ అనుకూలంగా ఉండడంతో పాటు లౌకికవాద దృక్పథం కలిగి మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన పార్టీ అని, అందుకే ఆ పార్టీకి అండగా నిలిచినట్లు సంఘం కన్వీనర్ నాగళ్ల పోచయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

‌ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో జత కట్టిన టీడీపీని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని పోచయ్య అన్నారు. మే 7న సీమాంధ్రలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిని ఓడించి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

Back to Top