ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న విజయమ్మ

హైదరాబాద్, 28 జూలై 2013:

బోనాలు పండును పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ దర్శించుకున్నారు.‌ తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా కొలుచుకునే మహంకాళి బోనాలు ఉత్సవాలు ఆదివారంనాడు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీమతి విజయ్మ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆరోగ్యంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. భక్తులందరూ సుభిక్షంగా ఉండేలా చూడాలని వేడుకున్నట్లు చెప్పారు. ఆషాఢ మాసంలో హైదరాబాద్‌లో ఇంత గొప్పగా బోనాలు పండుగ చేసుకుంటున్న భక్తులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top