కరీంనగర్‌లో నేడు విజయమ్మ విస్తృత సదస్సు

కరీంనగర్‌, 30 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సదస్సు ఆదివారంనాడు కరీంనగర్‌లో జరుగుతుంది. ఈ సదస్సులో స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ దిశా నిర్దేశం చేస్తారు. పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కరీంనగర్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మండలాల కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరవుతారు.

కరీంనగర్‌లోని వరలక్ష్మి గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు శ్రీమతి విజయమ్మ అధ్యక్షతన ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వారికి శ్రీమతి విజయమ్మ మార్గనిర్దేశనం చేస్తారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ నాయకులు పూర్తి చేశారు.

Back to Top