మాడుగుల, చోడవరంలలో నేడు మరో ప్రజాప్రస్థానం

చోడవరం (విశాఖ జిల్లా),

30 జూన్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర 195వ రోజు ఆదివారం నాడు చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర షెడ్యూల్‌ వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు ‌వివరించారు.

శ్రీమతి షర్మిల ఆదివారం ఉదయం చోడవరం నియోజకవర్గంలోని గజపతినగరంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. గోవాడ మీదుగా వెంకన్నపాలెం చేరుకుంటారని వారు వెల్లడించారు. వెంకన్నపాలెం సమీపంలో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మాడుగుల నియోజకవర్గంలోని రాయపురాజుపేట, సేమునాపల్లి, చౌడువాడ మీదుగా గుల్లేపల్లి చేరుకుంటారు. ఆదివారం రాత్రికి శ్రీమతి షర్మిల గుల్లేపల్లిలోనే బస చేస్తారు. ఆదివారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 14.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని రఘురాం, బాబూరావు తెలిపారు.

Back to Top