తలవరం నుంచి 218వ రోజు పాదయాత్ర

తలవరం (శ్రీకాకుళం జిల్లా),

23 జూలై 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 218వ మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా తలవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆమె అత్తలి, తుమరాడ మీదుగా తంపటపల్లి వరకూ పాదయాత్ర చేస్తారు. తామరాడలో ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ ధర్మాన పద్మప్రియ తెలిపారు. భోజన విరామానంతరం ఆమె పాలకొండ వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. పాలకొండలోనే ఈ రాత్రికి బసచేస్తారు. కాగా, శ్రీమతి షర్మిల పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో 3వ రోజు కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా మొత్తం 12.2 కిలోమీటర్ల దూరాన్ని నడుస్తారు.

Back to Top