ప్రారంభమైన షర్మిల 210వ రోజు పాదయాత్ర

ఆకులపేట (విజయనగరం జిల్లా),

15 జూలై 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 210వ రోజుకు చేరింది. శ్రీమతి షర్మిల సోమవారం ఉదయం విజయనగరం జిల్లాలోని ఆకులపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె బాగువలస మీదుగా వెదుళ్లవలస చేరుకుంటారు. వెదుళ్ళవలసలో ఆమె మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ పెన్మెత్స సాంబశివరాజు తెలిపారు.

భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల వెంకటాపురం జంక్షన్, బి‌ళ్ళలవలస, కుంచుగుమ్మాడ, గర్బాం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. గర్భాంలో రాత్రికి బసచేస్తారు. కాగా, విజయనగరం జిల్లాలో శ్రీమతి షర్మిల 8వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. సోమవారంనాడు ఆమె మొత్తం 16.3 కిలోమీటర్లు నడుస్తారని రఘురాం, సాంబశివరాజు వివరించారు.

Back to Top