మండాది (శ్రీకాకుళం జిల్లా),
25 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆమె తన 220వ రోజు పాదయాత్రను జిల్లాలోని మండాది నుంచి ప్రారంభించారు. ఆమె పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఐదవ రోజు కొనసాగుతోంది. వైయస్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజన్న తనయకు మద్దతుగా పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన రణస్థలం, లావేరు మండలాల్లోని 26 మంది సర్పంచ్‌లను శ్రీమతి షర్మిల అభినందించారు.
అక్కడి నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర అక్కులపేట, పాలవలస, తిమ్మాపురం, లక్ష్మీదేవిపేట మీదుగా బొడ్డేపల్లిపేట చేరుకుంటుంది. బొడ్డేపల్లిపేటలో మధ్యాహ్న భోజన విరామానికి ఆమె ఆగుతారు. అనంతరం శ్రీమతి షర్మిల ఆమదాలవలస రైల్వేస్టేషన్ చేరుకుంటారు. రైల్వేస్టేషన్ జంక్షన్‌లో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ తెలిపారు. సభ అనంతరం శ్రీమతి షర్మిల ఊసవానిపేట, కొత్తవానివలస మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. శొట్టవానిపేట సమీపంలో ఈ రాత్రికి బసచేస్తారు. గురువారంనాడు ఆమె మొత్తం 13.1 కిలో మీటర్లు నడుస్తారని రఘురాం, పద్మప్రయ తెలిపారు.