ఎందుకు ఓటేయాలని బాబును నిలదీయండి

కుప్పం (చిత్తూరు జిల్లా):

కుప్పం నియోజకవర్గం నుంచి 25 ఏళ్ళుగా ఎన్నికవుతున్న చంద్రబాబు నాయుడు మీకేమి చేశారని నిలదీయమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ‘ఒకసారి కాదు.., రెండు సార్లు కాదు. ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయుకుడిగా ఉన్నావు. అంటే 25 సంవత్సరాలు కుప్పం నుంచి గెలిచావు. ఇన్నేళ్లలో కుప్పానికి ఏమి చేశావు? కనీసం ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెచ్చావా? పరిశ్రమలు తెచ్చావా? ఉపాధి అవకాశాలు పెంచావా? తాగునీటి సమస్య తీర్చావా? ఒక ప్రాజెక్టు కట్టించావా? ఎందుకు మీకు ఓటేయాలి అని చంద్రబాబును నిలదీయండి’ అని కుప్పం నియోజకవర్గ ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు, తంబళ్లపల్లె, కుప్పం, వీ కోట, బంగారుపాళ్యంలలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో ఆమె మాట్లాడారు.

'రైతులు, మహిళలకు ఇచ్చిన రుణాలకు చంద్రబాబు రూపాయి వడ్డీ వసూలు చేస్తే, రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఎంతో మంది వుహిళలు బ్యాంకుల్లో డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడగలిగారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినా, రాజశేఖరరెడ్డి ఏ ఒక్క చార్జీ పెంచలేదు. ఒక్క రూపాయి ఏ పద్దు పెంచినా ఆ భారం పేద ప్రజలపై, అక్కాచెల్లెళ్లపై పడుతుంది. అది నాకు ఇష్టంలేదు అనేవారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖరరెడ్డి వెళ్లిపోయారు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్లిపోయిన తర్వాత ప్రతి పథకానికీ తూట్లు పొడిచింది. అన్ని చార్జీలు, పన్నులు పెంచింది. పాలకపక్షం ఇష్టానుసారం పనిచేస్తుంటే సపోర్టు చేసినవాడు ప్రధాన ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబు. ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్కసారైనా కాంగ్రె‌స్‌ పార్టీని నిలదీశారా?' అని ప్రశ్నించారు.

'మహానేత రాజశేఖరరెడ్డిగారిని పులివెందుల ప్రజలు 30 ఏళ్లు గెలిపించారు. అక్కడి ప్రజలను వైయస్‌ఆర్ ‌మనస్ఫూర్తిగా గౌరవించారు. అక్కడ పరిశ్రమలు పెట్టారు. వేల మందికి ఉపాధి కల్పించారు. అవుటర్ రింగ్‌రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రవూలు చేసి పులివెందుల రూపురేఖలు ‌మార్చారు. ఈ సారి ఓటేసే ముందు ఆలోచించండి. మీ కోసం ఏదీ చేయని చంద్రబాబును తిప్పి పంపండి. మీ ఓటును వృథా చేయుకండి' అని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

'రెండెకరాలతో జీవితం మొదలుపెట్టాడు చంద్రబాబు. ఈ రోజు ఆయనకు, ఆయున కొడుక్కు దేశ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. ఐఎంజీ అని ఒక బోగస్ సంస్థకు హైదరాబా‌ద్ నడిబొడ్డున 850 ఎకరాలు ఇచ్చాడు. ఎకరా రూ.4 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.50 వేలకు కట్టబెట్టాడు. ఆ‌యన, ఆయన కొడుకు రైతులు, పేదల గురించి ఆలోచించిన పాపానపోలేదు. మీ భవిష్యత్‌ కలను సాకారం చేసే రాజన్న రాజ్యాన్ని తెచ్చే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ఓటే‌యండి' అని విజ్ఞప్తి చేశారు.

Back to Top