సిబిఐ తీరుపై నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన

గుంటూరు, 27 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. జగన్మోహన్‌రెడ్డి భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న సీబిఐ తీరును వెల్లడిస్తూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వారంతా చిలకలూరిపేట సుభానీనగర్‌లోని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు.‌ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.

మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఒక న్యాయం, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఒక న్యాయం, వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి మరో న్యాయమా? అని నిరసనకారుడు ఈ సందర్భంగా ప్రశ్నించారు.
Back to Top