పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

చిత్తూరు(మదనపల్లె): నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. యువజన సెల్‌ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన కళ్యాణ్‌ భరత్‌ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేవిధంగా యువజన విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు.  గ్రామస్థాయిలోని యువకులను పార్టీవైపు ఆకర్షించేలా చైతన్యవంతం చేయాలని తెలిపారు.
Back to Top