ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి

వీరపునాయునిపల్లెః ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్‌ 6 తేదీ నుంచి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి చేపడుతున్న పాదయాత్ర విజయవంతం చేసేందుకు సోమవారం స్తానిక డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని,వారితో మమేకం అయ్యేందుకు జగన్‌మోహనరెడ్డి పాదయాత్ర చేపడుతున్నాడని తెలిపారు. ఈ పాదయాత్ర జరిగితే నష్టపోతామని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో ప్రజలనుద్దేశించి జగన్‌ ప్రసంగం చేస్తారని తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె మండలంలో ఈ పాదయాత్ర జరుగుతుందని, ఇది చరిత్రలో నిలిచిపోయేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 6వ తేదీ ఇడుపలపాయలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి మాట్డాతూ... వైయస్‌ సువర్ణపాలన ప్రజలకు అందాలంటే మనమంతా జగన్‌ నాయకత్వంను బలపరచాలని కోరారు. పాదయాత్ర ద్వారా దీనిని నిరూపించాలని కోరారు. ఎన్నికలలో చంద్రబాబు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ రగునాధరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్గర్‌ సుదర్వనరెడ్డి, వీఎన్‌పల్లె మాజీ సర్పంచు రవీంద్రనాధరెడ్డి, అలిదెన మాజీ సర్పంచు వాçసుదేవరెడ్డి తదితరులు పాల్గొని ప్రపంగించారు.

Back to Top