బాబూ.. సాగునీరివ్వండి

ఉరవకొండ (అనంత‌పురం): ``చ‌ంద్ర‌బాబు గారూ.. స‌భ‌లు, స‌మావేశాలు, శంకుస్థాప‌న‌లు కాదు మాకు పంట‌లు సాగు చేసుకోవ‌డానికి సాగునీరు ఇవ్వండి`` అంటూ రైతులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు ప‌ట్ట‌ణంలో క‌ర ప‌త్రాలు పంపిణీ చేశారు.  స్థానిక క్లాక్ ట‌వ‌ర్ నుంచి పార్టీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీపీ వీర‌న్న ఆధ్వ‌ర్యంలో పార్టీ నాయ‌కులు క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వీర‌న్న మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు స‌భ‌లు, స‌మావేశాలు,  శంకుస్థాప‌న‌లు అంటూ ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  హంద్రీనీవా ఆయకట్టు కింద నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు సాగునీరు  ఇవ్వ‌కుండా వేధిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు బసవరాజు, తేజోనాథ్‌లు మాట్లాడుతూ నియోజకవర్గానికి ముఖ్యమైన కొన్ని పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా ప్రకటించాలన్నారు. ఇందులో వజ్రకరూర్, విడపనకల్లు, ఉరవకొండలో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి. కూడేరు మండలం ఇప్పేరు, ముద్దాలపురం, కరుట్ల పల్లి చెరువులకు నీరు ఇచ్చి, కూడేరుతో పాటు 29 గ్రామాలకు తాగునీరు అందించే తాగునీటి పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. బెళుగుప్ప మండలంలో రూ57 కోట్లు విలువగల పనులకు రూ300కోట్లు పెంచుకోని ఏకపక్షంగా టెండర్లు వేసుకోని ధనహరతి చేశారని ఆరోపించారు. దీంతో పాటు జీబీసీ ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు.

Back to Top