ఇన్‌ఫుట్‌ సబ్సీడీలో అవకతవకలపై విచారణ జరిపించాలి

రామకుప్పం: ఇన్‌ఫుట్‌ సబ్సీడీలో జరిగిన అవకతకలపై విచారణ జరిపించాలని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండల వైయస్‌ఆర్‌ సీపీ  నాయకులు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2014–2015 సంవత్సరంలో వేరుశగన పంట సాగు చేసి నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో అగ్రికల్చర్‌ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని పేర్కోన్నారు. మొదట సర్వే చేసినప్పుడు ఉన్న భాధిత రైతుల పేర్లు నష్టపరిహారం వచ్చేసమయానికి లేకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వేరుశనగ వేయక పోయిన వేసినట్టు రికార్డులోకి పేర్లు ఎక్కించారని ఆరోపించారు. అదేవిధంగా నష్టపరిహారాన్ని భాధిత రైతుల ఖాతాలోకి జమచేయడంలో అధికారులు కాలయాపన చేస్తున్నారని మండి పడ్డారు. ఎన్నిసార్లు ప్రుఫ్‌లు ఇచ్చినా ఇవ్వలేదని రైతులను వేధిస్తున్నరని విమర్శించారు. సీఎం నియోజకవర్గంలేని ఇలా జరిగితే రాష్ట్రంమంత ఏ విధంగా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. దీనిపై ఉన్నత అధికారులు విచారణ జరిపించి అర్హులైన రైతులందరికి న్యాయం చేయాలని కోరారు. ప్రకటన చేసిన వారిలో మండల కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షులు గోవిందప్ప, జిల్లా యువజన విభాగ అధికార ప్రతినిధి శ్రీనివాసులురెడ్డి, ఎస్టీ సెల్‌ నాయకులు రవినాయక్, మండల నాయకులు నారాయణస్వామి, రమేష్‌రెడ్డి, రాఘవరెడ్డి, సుగుణప్ప, బసవారెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top