ఎస్ఐ నాగ‌రాజుపై చ‌ర్య‌లు తీసుకోవాలి

బూర్జ: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు జ‌క్కంపూడి రాజాపై దాడి చేసిన ఎస్ఐ నాగ‌రాజుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  మండల యువజన విభాగం అద్యక్షుడు గుమ్మడి రాంబాబు, యవజన విభాగం జిల్లా కార్యదర్శులు వావిలపల్లి గోవిందరావు, మామిడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం కొల్లివలసలో వారు విలేకరులతో మాట్లాడారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అద్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రాపురం ఎస్‌ఐ నాగరాజ్ దౌర్జన్యం చేయటం దారుణమన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఎంత కాలం నిలువ గలరని మండిప‌డ్డారు.  ఐదేళ్ల‌ రాజకీయ నాయకునికి మద్దతిస్తూ 60 ఏళ్ళ ఉద్యోగ జీవితాన్ని పాడు చేసుకోవద్దన్నారు. తెలుగుదేశం పాలనలో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయటం అప్రజాస్వామికమని వారు ధ్వ‌జ‌మెత్తారు. 
Back to Top