షర్మిల పాదయాత్ర విజయవంతానికి పూజలు

చిత్తూరు, 26 అక్టోబర్‌ 2012: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వైయస్‌ అభిమానులు, వైయస్‌ఆర్‌ సిపి కార్యకర్తలు చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. జిల్లాలోని వి.కోట ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం వారంతా పూజలు నిర్వహించి, స్వామివారికి 501 కొబ్బరికాయలు సమర్పించుకున్నారు.
వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి ఈ నెల 18న ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సుమారు 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.
కాగా, షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం 9వ రోజుకు చేరింది. అనంతపురం జిల్లా తుమ్మల క్రాస్ నుంచి ఉదయం‌ ఆమె పాదయాత్ర ప్రారంభమైంది. మల్లేనిపల్లి, ధర్మవరం, శివానగర్, పేరు బజా‌ర్, అంజుమ‌న్‌ సర్కిల్, గాంధీనగర్, గొల్లపల్లి మీదుగా పాదయాత్ర కొనసా‌గుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top