షర్మిల పాదయాత్ర రేపటి షెడ్యూల్‌ ఇదీ

హైదరాబాద్, 5 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర షెడ్యూల్‌ను పాదయాత్ర సమన్వయకర్తలు కె.కె. మహేందర్‌రెడ్డి, తలశిల రఘురాం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ గార్డెన్సు నుంచి ప్రారంభం అవుతుందని వారు తెలిపారు.

అక్కడి నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర రాగన్నగూడ, మన్నెగూడ, ఒఆర్‌ఆర్‌, బొంగులూరు గేట్‌ మీదుగా కొనసాగుతుంది. బొంగులూరు గేట్‌ సమీపంలో ఉన్న కల్లెం జగ్గారెడ్డి గార్డెన్సులో పాదయాత్రకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. అనంతరం ఆమె మంగలంపల్లిగేట్‌, షేరెగూడ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల ఇబ్రహీంపట్నంలోని కెఎన్‌ఆర్‌ గార్డెన్సులో రాత్రి బస చేస్తారని మహేందర్‌రెడ్డి, రఘురాం వివరించారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారంనాడు మొత్తం 15.5 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ‌ం ప్రజావ్యతిరేక విధానాలు, అసమర్థ, ప్రజాకంటక పరిపాలనకు, అధికార కాంగ్రెస్,‌ ప్రతిపక్ష టిడిపి కుమ్మక్కు, కుట్రపూరిత రాజకీయాలకు నిరసనగా శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గడచిన డిసెంబర్ 14‌న రంగారెడ్డి జిల్లాలోని బిఎన్ రెడ్డి నగ‌ర్‌లో జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మోకాలికి గాయం కావడంతో.. మరుసటి రోజు తుర్కయాంజాల్ సమీపంలో పాదయాత్రకు ‌విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.
Back to Top