షర్మిల పాదయాత్ర ప్రజలకోసం: శోభానాగిరెడ్డి

అనంతపురం:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల ప్రజల కోసం మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ  ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారం కోసం పాదయాత్ర చేపట్టారని ఆమె ధ్వజమెత్తారు. సమర్ధుడైన నాయకుడు లేకే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలను వీడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించినా జనం ఆయన వెంటే ఉన్నారని చెప్పారు. షర్మిల పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా  తరలివస్తున్నారని ఆమె చెప్పారు.

Back to Top