షర్మిల మరో ప్రజాప్రస్థానం నేటి షెడ్యూల్ ఇలా..

నల్గొండ, 12 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారంనాడు నల్గొండ జిల్లా కనగల్ మండలంలో సా‌గుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను,‌ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ శ్రీ వైయస్‌ తరఫున శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ, చారిత్రక పాదయాత్ర చేస్తున్నారు.

మంగళవారం ఉదయం జిల్లాలోని ఉడతలపల్లి నుంచి శ్రీమతి షర్మిల 64వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ మండల‌ం పరిధిలో ఉన్న కురంపల్లి, జి.యడవెల్లి, బుడమర్లపల్లి, కనగల్ ఎ‌క్సురోడ్డు మీదుగా కనగల్ మండల కేంద్రానికి‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర చేరుకుంటుంది. కనగల్‌ సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కనగల్ సమీపంలో‌నే మంగళవారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారు.
Back to Top