వచ్చేవారం విజయనగరానికి షర్మిల పాదయాత్ర

విజయనగరం 03 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 10, 11 తేదీల్లో విజయనగరం జిల్లాలో ప్రవేశిస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్  నేత సుజయ కృష్ణ రంగారావు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పడుతున్న ఇబ్బందులను షర్మిలతో చెప్పుకోవడానికి ప్రజలకు ఇదో మంచి అవకాశమని ఆయన తెలిపారు. జిల్లాలో 9 నియోజకవర్గాల మీదుగా 160 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారని వివరించారు. మరోవైపు ఈ నెల 8న ఇడుపులపాయలో జరగనున్న పార్టీ ప్లీనరీకి జిల్లా నుంచి పార్టీ ప్రతినిధులతో పాటు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిమానులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను మరో నేత పెన్మత్స సాంబశివరాజు ఆవిష్కరించారు.

Back to Top