సిగ్గు, ఎగ్గులేని ప్రభుత్వం

బాబు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు
రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టుపెట్టాడు
పశువులను కొన్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నాడు
అక్రమాలను అరికట్టడం వైయస్ జగన్ తోనే సాధ్యంః పార్టీ నేతలు

కర్నూలు: నీటి ప్రయోజనాలు దెబ్బతింటున్నా..చంద్రబాబు సర్కార్‌లో చలనం లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జలదీక్ష వేదికపై ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు పట్టించుకోని కారణంగానే గత పది నెలలుగా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిందన్నారు. 120 టీఎంసీల నీటిని తెలంగాణ తోడుకుంటే మన పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు అనైతికమని ఎంపీ బాబుపై ఫైరయ్యారు.  వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరును ఎంపీలు పార్లమెంట్లో ఘోల్లున నవ్వారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. పార్టీ మారిన ఎంపీలు ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీతా పరిస్థితి ప్రస్తుతం దయణీయంగా మారిందని పేర్కొన్నారు. అదే పరిస్థితి 17 మంది ఎమ్మెల్యేలకు వస్తుందని చెప్పారు. వారు చట్టసభల్లో మాట్లాడే పరిస్థితి ఉండదని వివరించారు. చంద్రబాబు గుణగణాలు అందరికీ తెలుసనని, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలను ఆటకట్టించాలని పిలుపునిచ్చారు. 

ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టాడు
అంబటి రాంబాబు:
తెలంగాణ సర్కార్ ఏపీకి చేస్తున్న అన్యాయంపై వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిరాహార దీక్ష‌లు చేస్తుంటే ....చంద్ర‌బాబు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి గుర్రుపెట్టి నిద్ర‌పోతున్నార‌ని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  ఓటుకు నోటుకు కేసు భయంతో ప‌క్క రాష్ట్రం చేస్తున్న అన్యాయాన్ని చూసి కూడా బాబు క‌నీసం ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఫైరయ్యారు.  ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బాధ్య‌త గలిగిన ప్ర‌తిప‌క్ష పార్టీగా, ప్ర‌జ‌ల సంక్షేమం గుర్తెరిగిన నాయ‌కుడిగా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ల‌దీక్ష చేస్తుంటే ....మంత్రులు జననేతపై నింద‌లు వేస్తూ బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్రమాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర‌ రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌ుతాడ‌ని ప్రజలు ఓట్లు వేస్తే ...  బాబు త‌న హ‌క్కులు, త‌న కుటుంబ స‌భ్యుల హ‌క్కులు కాపాడుకుంటున్నార‌ని ఆరోపించారు. త‌న ఒక్క‌డి ప్ర‌యోజ‌నం కోసం ఆంధ్ర‌రాష్ట్ర భ‌విష్య‌త్తును తెలంగాణ పాదాల వ‌ద్ద తాకట్టు పెట్టార‌ని రాంబాబు మండిప‌డ్డారు. 

రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులు
వైయస్‌ఆర్‌ సీపీ కర్నూలు జిల్లా పరిశీలకులు అనంత వెంకట్రామిరెడ్డి:
కర్నూలు: రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలని దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారని కర్నూలు జిల్లా పార్టీ పరిశీలకులు అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. కర్నూలు జిల్లా జలదీక్ష ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చెందాల్సిన వనరులను సాధించలేకపోగా తెలంగాణ ప్రభుత్వం మనకు దక్కాల్సిన నీటి  వనరుల్ని దక్కకుండా చేస్తుంటే నోరు మెదపకుండా కూర్చున్నారన్నారు. జిల్లాల్లో పర్యటించి అదిగో.. ఇదిగో ఇస్తున్నాం.. చేస్తున్నాం.. అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఎందకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. స్వర్గీయ వైయస్‌ఆర్‌ చేపట్టిన పథకాలు పూర్తయినా కొసమెరుపు దిద్దడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారన్నారు. డబ్బులు మాత్రమే సంపాదించుకునే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర సీఎం చేయాల్సిన పనిని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన భుజాలపై వేసుకొని దీక్షలు చేస్తుంటే విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అరికట్టడం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. 


రైతాంగ భవిష్యత్తు కోసం వైయస్‌ జగన్‌ దీక్ష
మాజీ మంత్రి కె. పార్థసారధి:
కర్నూలు: రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో మూడు కాలాల పాటు పచ్చగా ఉండాలనే ధృడ సంకల్పంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేపట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారధి అన్నారు. కర్నూలు వైయస్‌ జగన్‌ జలదీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. దేశంలో ప్రజల సమస్యల కోసం ఇన్ని దీక్షలు చేసిన ప్రతిపక్ష నేత ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని  చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు చేతగాని తనం వల్ల రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలోని ఇరిగేషన్‌ మంత్రి అంత చవట.. చచ్చుదద్దమ్మ దేశంలోనే ఎక్కడా దొరకడన్నారు. ప్రాజెక్టులు, నీటిపై ధ్యాస లేకుండా మట్టిని, ఇసుకను అమ్ముకోవడానికి చూస్తున్నాడన్నారు. ఆఖరికి పేడ అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి నీటి కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు బ్రోకర్లలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్‌ కు ఏమాత్రం సిగ్గు, ఎగ్గు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాలని కోరారు. 


గొర్రెలకు బలిపీఠం తప్పదు 
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి:
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, పశువులు నీరు లేక అల్లాడుతుంటే... చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అడగకుండానే మందు ఇస్తున్నారని.. ఆ మందు తాగిన వారికి మత్తుదిగడానికి చంద్రన్న మజ్జిగ ఇస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవడానికన్నా.. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అభిమానిని.. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడని వీరాభిమానని చెప్పుకోవడానికి ఎక్కువగా గర్వపడతానని రాచమల్లు చెప్పారు. ఎగువన తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే ఎదుర్కొవాల్సిన ముఖ్యమంత్రి సంతలో పశువులను కొన్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు ఫిరాయింపు దారులంతా చంద్రబాబును నమ్ముతున్నారు. రానున్న ఎన్నికల్లో గొర్రెలు బలిపీఠం ఎక్కి ఓటమి చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఏపీ నీటి హక్కు కోసం మరోసారి ముందుకు వచ్చి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారని చెప్పారు. రాష్ట్రం ఎడారి కాకుండా ఉండాలంటే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసివచ్చి పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని కోరారు. రానున్న కాలంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైయస్‌ఆర్‌ సీపీ చేస్తున్న శాంతియుత ర్యాలీకి ప్రజలంతా కలిసివచ్చి పోరాడాలని చెప్పారు. 
Back to Top