బాధితులకు అండగా ఉంటా

కర్నూలుః వేంపెంట పవర్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఇవాళ పాములపాడు మండలం
వేంపెంట గ్రామంలో నిప్పులవాగుపై నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈప్లాంట్  నిర్మాణం వల్ల రైతులు, గ్రామస్తులు నష్టపోతారని ఏడాది కాలంగా ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడంతో ఐజయ్య గ్రామాన్ని సందర్శించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.  పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపేయాలని ఐజయ్య అధికారులను కోరారు.
Back to Top