పూలే సేవలు మరువలేనివి

సుజయకృష్ణ రంగారావు
సమాజంలోని వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అన్నారు. బొబ్బిలిలోని పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి వేడుకలను నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సుజయకృష్ణ మాట్లాడుతూ ...పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. 

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పలానారోడ్డులోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల శివ, మాజీ కౌన్సిలర్ షేక్ హుస్సేన్ ల ఆధ్వర్యంలో పేద మహిళలకు  చీరెలు పంపిణీ చేశారు. ఆసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే వారు అన్ని విధాలుగా ఎదిగేందుకు అవకాశముంటుందన్నారు.  ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షియల్స్ గా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రొంపిచర్లలో బీసీ హాస్టల్ నిర్మాణానికి నిధులు విడుదలై మూడేళ్లు గడుస్తున్నా... ఇప్పటివరకు హాస్టల్ భవనానికి శంకుస్థాపన కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.  

వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్.. స్థానిక 16వ వార్డులోని పార్టీ కార్యాలయంలో పూలే 190వ జయంతిని ఘనంగా  నిర్వహించారు.  స్థానిక నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి పూలే ఎనలేని కృషి చేశారని ఉప్పాల తెలిపారు. ప్రతి ఒక్కరూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 

పూలే దేశానికి చేసిన సేవలు మరువలేనివని ప్రకాశం జిల్లా లింగసముద్రం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అందరికీ స్వీట్లు పంచారు. 

సమాజంలో మానవత్వం కోసం మహాత్మా పూలే చేసిన సేవలు మరువలేనివని గురజాల మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ అన్నారు. స్థానికంగా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎనలేని పోరాటం చేశారని గాంధీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పూలే జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు
Back to Top