చిన్నారులందరినీ బడికి పంపండి

చిన్నారులు చదువుకుంటేనే వారి జీవితాలు బాగుపడతాయనీ, అప్పుడే సమాజం పురోభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసంతోనే అధికారంలోకి వస్తే బడికి పిల్లలను పంపే ప్రతి ఇంటికి ఏటా 15 వేలు ఇవ్వనున్నామని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఆయన  పలువురి మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రతి తల్లి తమ చిన్నారులను తప్పనిసరిగా బడికి పంపి ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అలాగే ప్రజల ఆశీస్సులు, దేవుడు దీవెనలతో అధికారంలోకి వస్తే, డ్వాక్రా మహిళలకు నాలుగు దఫాలుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నా వడ్డీ కింద మహిళలకు చెల్లించాల్సిన వాటిని బ్యాంకులకు చెల్లించడం మానేయడంతో బ్యాంకులు ఆ రుణాలు ఇవ్వడం మానేశారని వివరించారు . అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి పరిస్థితి రాకుండా, సున్నా వడ్డీకి సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులకు కడతామని భరోసా ఇచ్చారు. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే , చిన్నారుల చదవుల కోసం, మహిళల కోసం అమలు చేయనున్న కార్యక్రమాల గురించి అందరికీ వివరించాలని ఆయన కోరారు.
Back to Top