ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

హైదరాబాద్ః రాజధానిలో రైతుల భూములు తీసుకొని ఏడాది గడుస్తున్నా ఇంతవరకు వారికి ప్లాట్లు కేటాయించకపోవడం దారుణమని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకునే విధంగా బాబు పాలన సాగుతోందని అన్నారు. రైతుల భూములను బలంవంతంగా లాక్కొని సింగపూర్ కు తాకట్టు పెట్టారు. ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని టీడీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతి, అన్యాయాలను ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షాన్ని ఉగ్రవాదులతో పోల్చుతూ బురదజల్లుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. వైయస్ జగన్ ప్రజలకు అండగా ఉంటే అది ఓర్వలేక బాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు.

Back to Top