సీబీఐ చార్జిషీటులో అంశాలు కొట్టివేత

హైదరాబాద్, 14 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట కలిగించే అంశం మంగళవారం నాడుచోటుచేసుకుంది. ఆయనకు వ్యతిరేకంగా సీబీఐ ఐపీసీ 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 ప్రకారం దాఖలు చేసిన నమ్మకద్రోహం, అవినీతి అంశాలను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది.

దాల్మియా సిమెంట్సు కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీటును పరిశీలిస్తున్న సందర్భంలో కోర్టు పై ఆరోపణలను అంగీకరించలేదు. వాటిని నిరూపించడానికి తగిన సాక్షాధారాలు లేవని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి నమ్మకద్రోహానికీ, అవినీతికి పాల్పడ్డాడనికి ఇందులో ఆధారాలు లేవని అభిప్రాయపడింది.

సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో పేర్కొన్న రెండు సెక్షన్లు శ్రీ జగన్మోహన్ రెడ్డికి వర్తించవని కోర్టు స్పష్టంచేసింది.
సీబీఐ గతంలో దాఖలుచేసిన నాలుగు చార్జీషీట్లలో కూడా ఇవే ఆరోపణలను ప్రస్తావించిన సంగతిని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో గతంలో దాఖలు చేసిన చార్జీషీట్లలో చేసిన ఈ ఆరోపణలు హైకోర్టులో న్యాయ పరిశీలనకు నిలుస్తాయా అనేది వేచి చూడాలి.

Back to Top