ప్రజలకు క్షమాపణ చెప్పి పెద్దరికం కాపాడుకోవాలి

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సకల సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి పెద్దరికం కాపాడుకోవాలని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దుకు తానిచ్చిన సలహానే కారణమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు కూడా బాధ్యత వహించాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఒకరిద్దరికి మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని కేవలం కారుపై లైటేసుకుని వెళ్లడానికి తప్ప మరెందుకూ పనికిరావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనంతా సీఎం పేషీ నుంచే జరుగుతుందని ఆరోపించారు.

Back to Top