సంకల్పసూరీడై..!




 - మళ్లీ ప్రజాక్షేత్రంలోకి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ 
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగతం
- పాద‌యాత్ర దారుల్లో పండుగ వాతావ‌ర‌ణం
- అన్నొచ్చాడ‌ని సంబ‌ర‌ప‌డుతున్న జ‌నం
- అంద‌రి బాధ‌లు ఓపిక‌తో వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ 
- ప్రజా సంకల్ప యాత్రకు అదే ఆద‌ర‌ణ‌..అదే స్ఫూర్తి

విజ‌య‌న‌గ‌రం: సంకల్పమే ఆయన ఊపిరి... ప్రజల మధ్య ఉండాలని, వారి బాగోగులు తెలుసుకోవాలి...రాజన్న రాజ్యం తీసుకొచ్చి.... ప్రజాసమస్యలన్నీ పరిష్కరించాలి... ఇదే ఆయన ధ్యేయం, ఆయన లక్ష్యం... ఈ లక్ష్యసాధనలో ఎదురవుతున్న అవరోధాలను దాటుకుంటూ, కుట్ర రాజకీయాలను ఛేదిస్తూ... సంకల్పసూరీడై ముందుకు సాగుతున్నారు వైఎస్‌ జగన్‌. తనపై హత్యాయత్నం జరిగినా అదరక, బెదరక... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి.. పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మృత్యుంజయుడై తమ వద్దకు వస్తున్న రాజన్న బిడ్డను ప్రజలు ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. ఆయన్ను కలవాలని... ఎలా ఉన్నారో ఒక్కసారి కళ్లారా చూడాలని తరలి వస్తున్నారు. 

అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విశ్రాంతి అనంతరం వైయ‌స్‌ జగన్‌ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు.రాజ‌న్న బిడ్డ‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగతం ప‌లికారు. జ‌న‌నేత వ‌చ్చార‌ని ప్ర‌జ‌లు ఎదురెళ్లి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. త‌న‌ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌లు ఓపిక‌గా ఉంటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 


ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  ముఖ్యంశాలు ఇలా..

– విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని పాయకపాడు శివారులోని శిబిరం నుంచి యాత్ర ప్రారంభం.
 – సోమవారం ఉదయం శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.
– జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజుతో పాటు రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కళావతి తదితరుల జ‌న‌నేత‌ను క‌లిసి ఆయ‌న‌తో అడుగులో అడుగులు వేశారు.
– పాదయాత్రలో  మేలపువలస చేరుకున్న  వైయస్‌ జగన్ కుమ్మ‌రుల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.
– గ్రామంలో కుమ్మరులతో మమేకమై కుండల తయారీ చక్రం తిప్పిన జననేత. వారి సమస్యలు, కష్టాలపై ఆరా. 
– పాదయాత్రలో జననేతను కలిసి బాధలు చెప్పుకున్న దివ్యాంగుడు. రూ.3 వేల లంచం ఇవ్వకపోవడంతో పింఛను మంజూరు చేయలేదని విపక్షనేతకు ఫిర్యాదు.
– ఆ తర్వాత మక్కువ క్రాస్‌ చేరుకున్న  వైయస్‌ జగన్‌కు స్వాగతం చెప్పేందుకు బారులు తీరిన మహిళలు.
– గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో జననేతపై హత్యా యత్నాన్ని తల్చుకుని ఉద్వేగానికి లోనైన మహిళలు. రాజన్న బిడ్డకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టీకరణ.
– ఇక దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న విద్యార్థులు, దివ్యాంగులు. తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరిన పలువురు తల్లులు.
– వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఇంకా ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన మహిళలు, విద్యార్థులు.


Back to Top