ప్రోటోకాల్ విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

వైయ‌స్సార్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ డిమాండ్ 

ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు

కర్నూలు జిల్లా:  కోడుమూరు నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన ఘటనపై వైయ‌స్సార్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ను విస్మరించి శిలాఫలకాలపై పేర్లు నమోదు చేయడం సరైంది కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ గారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాలనా లోపమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే శిలాఫలకాలను సవరించాలని కోరారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, స్వర్ణ గ్రామం, రైతు సేవా కేంద్రం, అలాగే బి తాండ్రపాడు మరియు దిన్నెదేవరపాడు గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల శిలాఫలకాలపై కర్నూలు మండల ఎంపీపీ, జడ్పిటిసి సభ్యుల పేర్లు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా పొందుపరచినట్లు ఆరోపించారు.

ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా శిలాఫలకాలను ప్రారంభించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాలను వెంటనే సవరించి తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ గారు విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top