తాడేపల్లి: బీసీల సాధికారతకు వైయస్ జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా బీసీ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సాధికార విభాగ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. బీసీ సెల్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..బీసీల సాధికారతకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎంత పెద్ద పీట వేసిందనేది మనమంతా గమనించాం, బీసీల కోసం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం, బీసీలకు ఇచ్చిన హామీలు మాటలు మాత్రమే కాదు చేతల్లో చూపిన నాయకుడు మన లీడర్ జగన్. ఒక విజన్, దార్శనికతతో ఆలోచించి దానిని అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. సమాజంలో వెనకబడిన వర్గాలకు ఎంత మేలు చేయగలమో ఆంతవరకు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయం జగన్ గారిది. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి ప్రతి విషయంలో బీసీలకు చేయి అందిస్తూ వారికి వెన్నెముకలా నిలిచిన ప్రభుత్వ పాలన జగన్ గారి హయాంలో మనమంతా చూశాం. కానీ ఇప్పుడు నాడు లబ్ధిపొందిన వర్గాలన్నీ ఇప్పుడు చర్చించుకునే పరిస్ధితి వచ్చింది. నాడు హక్కుగా పొందిన సంక్షేమం ఇప్పుడు కనుమరుగై పోయింది. కూటమి ప్రభుత్వంలో అవినీతి వ్యవస్ధీకృతంగా మారింది, ప్రతి చోటా రాజకీయ జోక్యమే, విచ్చలవిడి అవినీతి, బరితెగించి వసూళ్ళు, రాజధాని పేరుతో మోయలేనంత భారం, వ్యతిరేకించిన వారంతా దేశద్రోహులు అన్నట్లు చిత్రీకరిస్తున్నారు, జగన్ గారి మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ మొదలైంది. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో నిరంతరం దోచుకునే కార్యక్రమానికి తెరలేపారు. అమరావతి భారం రాష్ట్రమంతా భరించాలంటున్నారు. జనాన్ని మభ్యపెట్టి మాటలతో కోటలు కడుతున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇచ్చారు. వేలకోట్ల దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు చేస్తున్నది సంపద సృష్టి పేరుతో దోపిడీనే. రాజధాని నిర్మాణంలో చదరపు అడుగు మూడు వేలలోపు ఉంటే కానీ ఇక్కడ మాత్రం 14 వేలతో కట్టడం, పైగా హైరైజ్ పేరుతో 40 అంతస్ధులు, 50 అంతస్ధులు కట్టాలనుకోవడం, ఇదంతా మోయలేని భారం కాదా, రాయ్‌పూర్ పేరుతో నిర్మించిన నగరం పరిస్ధితి ఏంటనేది మనం చూస్తున్నాం. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు, తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరిని అలాగే అరెస్ట్ చేశారు. టెర్రరైజ్ చేయడం వేధించడం, అక్రమ కేసులు పెట్టడం ఇది నిత్యకృత్యమయింది. చంద్రబాబు, లోకేష్ కోసం అరెస్ట్‌లు చేస్తున్నారు, కనీసం 50 నుంచి 100 మంది పోలీసులు శ్రీహరి అరెస్ట్ కోసం పనిచేశారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఒక తప్పుడు కేసు పెట్టి ఇంత మంది పోలీసులు పనిచేస్తున్నారు, అదే నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎస్పీ ఆఫీస్‌లో బాత్‌రూమ్ తలుపులు గొళ్ళెం పెట్టుకుని హాడావిడి చేస్తే నో కేస్. చట్టం, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేదానికి ఇది ఉదాహరణ కాదా, ఇంత అన్యాయమైన పరిస్ధితులు ఎక్కడైనా ఉంటాయా ఇంత జరుగుతున్నా వైయస్ఆర్‌సీపీ ది ప్రజల పక్షమే, మెడికల్ కాలేజీలు, పోర్టులు, పిషింగ్ హార్బర్‌లు ఇలా వైయస్ జగన్ గారి పాలనలో ఎన్నో అందుబాటులోకి తీసుకొచ్చి మనం సుపరిపాలన అందజేస్తే దానికి విరుద్దంగా కూటమి పాలన సాగుతోంది. వైయస్ఆర్‌సీపీ కమిటీల నియామకం, ఐడీ కార్డుల వెరిఫికేషన్ విస్తృతంగా జరుగుతోంది. డేటా అంతా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం. గ్రామస్ధాయి కమిటీల నిర్మాణంపై మీరంతా సీరియస్ గా దృష్టిపెట్టాలి. జగన్ గారి విజన్‌ను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలనేదానిపై మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలి. జగనన్న కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధం: బీసీ నేతల స్పష్టీకరణ : మాజీ మంత్రి జోగి రమేష్ వైయస్.జగన్ నాయకత్వంలో పనిచేయడానికి, ఆయన కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకడుగు వేయం. వైయస్.జగన్ మా నాయకుడు అని చెప్పడానికి మేమంతా గర్వపడతాం. మా నాయకుడు కాలు బయటపడితే జనం వెల్లువలా తరలివస్తారు. ప్రతి రోజు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ వారికే పెద్దపీట వేయాలని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి వైయస్.జగన్. మనకంటూ ఒక ఆశ, ఆశయం ఉండాలి. ఆశయం పెట్టుకుని పనిచేస్తే కచ్చితంగా మంచి స్థాయికి ఎదగుతాం. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. కడప జిల్లా నుంచి సాధారణ కార్యకర్తగా మొదలైన నేను... యాదవ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన 5వ వ్యక్తిని. కష్టపడిన కార్యకర్తకు పెద్ద పీట మన పార్టీలో లభిస్తుంది. ఎమ్మెల్సీలలో10 మందికి పైగా బీసీలున్నారు. మన ప్రభుత్వంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. ఎవరు ఏమన్నా వచ్చేది వైయస్సార్సీపీ ప్రభుత్వమే. అందుకు మనందరం కష్టపడి పనిచేయాలి. అదే సమయంలో పార్టీ కమిటీలను త్వరగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఏలూరులో జరిగిన బీసీ గర్జనతోనే మనకు 151 సీట్లు వచ్చాయి. మనందరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైయస్.జగనన్నకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం. కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రయాణం ముగిసిపోయింది. డీలిమిటేషన్ తర్వాత సగం మంది బీసీలుండాలని కోరుకుంటున్నాను. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల్లో ఆ మేరకు చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాను. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. చట్టసభల్లో ఎలా మాట్లాడాలి, ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలి అన్న విషయాలను వారిని చూసి నేర్చుకోవాలి. బీసీ అక్కచెల్లెమ్మలకు కూడా డీలిమిటేషన్ తర్వాత అవకాశాలు వస్తాయి. కాబట్టి అందరూ మరింత పట్టుదలతో పనిచేయాలి. పార్టీ వేదికగా ప్రజా సేవచేయడానికి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు మరింత దీక్షతో కృషి చేయాలి. జగనన్నతో మాట్లాడి బీసీలకు మేలు చేసే దిశగా అందరం కలిసి పనిచేద్దాం. అందులో భాగంగా జిల్లాల్లో బీసీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ ప్రభుత్వానికి రెండేళ్ల కాలం పూర్తైంది. మిగిలిన కాలమంతా మరింత పట్టుదలతో ప్రభుత్వంపై పోరాడాలి. అరెస్టులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రభుత్వం ఇలాంటి పిల్లచేష్టలకు పాల్పడుతోంది. వైయస్.జగన్ హాయంలో బీసీలకు జరిగిన మేలు మరెవ్వరి హయాంలోనూ జరగలేదు. దురదృష్టవశాత్తూ మనం ఆ మేలును చెప్పుకోలేకపోయాం. ఇవాళ బీసీలు చంద్రబాబు హయాంలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. వారందరినీ ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఈ సదస్సు ద్వారా భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుని దాన్ని సక్రమంగా అమలు చేయాలి. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి. బడుగు బలహీన వర్గాల వారికి పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని వైయస్.జగన్ హయాంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లిషి మీడియం, ఐబీ, పిల్లలకు ట్యాబులు, నాడు- నేడు ద్వారా స్కూల్లు ఆధునీకరణ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రా, కృష్ణా, గోదావరి, రాయలసీమ జిల్లాల్లో బీసీలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వెనుకబాటుతనం. ఆలా వెనుకబాటుకు గురైన.. మన వాళ్ల తరపున మనమే గొంతెత్తి పోరాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నేతృత్వలోని కూటమి ప్రభుత్వంలో విపరీతంగా విష ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమల్లో విఫలమవడంతోనే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా తొక్కిపెట్టింది. దానిపై పోరాటం చేయాలి. మరోవైపు ప్రతి జిల్లాలోనూ జిల్లా బీసీ అధ్యక్షులు... బీసీల సమస్యపై అడ్రస్ చేయాలి. అధికార తెలుగుదేశం పార్టీ బీసీలను ఏ రకంగా మోసం చేస్తుందన్న దానిపై చర్చ జరగాలి. అంతేకాకుండా వైయస్.జగన్ హయాంలో గతంలో ఉన్న కాలేజీలకు అదనంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభిస్తే.. వాటిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా బీసీలకు ఎలా మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేశాడన్నది ప్రజలకు చెప్పాలి. ఇవన్నీ చేయడానికి ముందు కమిటీల నియామాకలు త్వరితగతిన పూర్తి చేయాలి. మన ప్రభుత్వ హయాంలో సుమారు 85 మంది వివిధ బీసీకార్పొరేషన్ లచైర్మన్ లగా పనిచేశారు. వీళ్లంతా మరలా పార్టీని ఎలా అధికారంలోకి తీసుకుని రావాలన్నదానిపై పనిచేయాలి. సమావేశం అనంతరం బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే బీసీ గళం సమావేశం పోస్టర్‌ను నేతలు ఆవిష్కరించారు.