రాయలసీమ లిఫ్ట్‌ పై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?

పుట్టి, పెరిగి, గెలిపించిన సీమకే ద్రోహం చేస్తున్నారు

తెలంగాణ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు

రాయలసీమ లిఫ్ట్‌ కోసం పాదయాత్రకు మేం సిద్దం

చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల స్పష్టీకరణ

తిరుపతిలో నిర్వహించిన ’రాయలసీమ ఎత్తిపోతల పథకం–చంద్రబాబు మోసం’ సమావేశంలో మాట్లాడిన  వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా నాయకులు

రాయలసీమకు చంద్రబాబు అడుగడుగునా ద్రోహం.
:భూమన కరుణాకర్‌ రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి. మాజీ ఎమ్మెల్యే

– మహానుభావుడు రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాక, అది కూడా సరిపోదని, 85 వేల క్యూసెక్కులకు పెంచాలన్న చారిత్రక నిర్ణయం జగన్‌గారు తీసుకున్నారు. ఈ హెడ్‌ రెగ్యులేటర్‌కు నీటి సరఫరా కోసం రూ.4 వేల కోట్లతో రాయలసీమ లిఫ్ట్‌కు శ్రీకారం చుట్టారు. దీని కోసం దాదాపు రూ.800 కోట్లు ఖర్చు కూడా చేశారు. వైయస్సార్‌ తెచ్చిన జలయజ్ఞాన్ని ఆ తర్వాత సీఎం అయిన చంద్రబాబు సమూలంగా నాశనం చేశాడు. వ్యవసాయం దండుగ అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజశేఖర్‌ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయిస్తే, ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్రంలో నదుల సంధానం తన జీవితాశయం అంటున్నాడు. చంద్రబాబుకు ఇలాంటి జీవితాశయాలు రెండు కోట్లు ఉంటాయి. కనబడిన ప్రతీదీ జీవితాశయం అని చెప్పుకుంటూ ఏదీ నెరవేర్చకపోవడమే ఆయన నైజం.
    తెలంగాణ ముఖ్యమంత్రితో చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపిన వ్యక్తి కూడా చంద్రబాబే. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 300పైగా చెరువుల పూడికలు తీయడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే గాలేరు–నగరి కింద 1.07 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. చంద్రబాబు సొంత జిల్లాలో సాగునీటి పథకాలు కూడా పట్టించుకోకపోవడం వల్లే వైయ‌స్ఆర్‌సీపీపోరాటాలు చేస్తోంది. 
చిత్తూరు జిల్లాలో 8 వేల చెరువులు నీళ్లు లేక అల్లాడుతున్నాయంటే వ్యవసాయం మీద పరిజ్ఞానం లేని చంద్రబాబే కారణం.
రాయలసీమ లిఫ్ట్‌ కోసం ఈ ప్రభుత్వం మీద జగనన్న సైనికులుగా పోరాడేందుకు అందరూ సిద్దంగా ఉండాలి. ఇందుకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.

రాయలసీమ లిఫ్ట్‌ పూర్తి కాకపోతే సీమ ఎడారే
:సాకే శైలజానాథ్‌. మాజీ మంత్రి.

– రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతానికి పెద్ద కష్టం రాబోతోంది. రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేŠశ్‌ మొత్తానికి నీటి కష్టాలు రాబోతున్నాయి. కృష్ణానది నీళ్లు రాకపోతే రాయలసీమ జిల్లాలకు తాగునీరు కూడా దొరకని పరిస్ధితి. కృష్ణా నది మీద ఆధారపడిన ప్రాజెక్టులన్నీ ఎండిపోయే కాలం దగ్గర్లోనే ఉంది. దీనికి కారణం చంద్రబాబు పాలన. ఆయనతో పాటు కర్నాటక నీటి యాజమాన్యం కూడా రాయలసీమకు కష్టాలు తెచ్చిపెట్టబోతోంది. చంద్రబాబు ఎప్పుడూ వ్యవసాయం మీద ప్రేమగా లేడు. పంటలు రోడ్ల మీద పారేసిన రైతుల మీద కూడా చంద్రబాబుకు ఏమాత్రం జాలి లేదు. రాయలసీమ ప్రజల ప్రాణాలు కాపాడే ఓ ఇన్సూరెన్స్‌ పథకంలా జగన్‌ గారు రాయలసీమ లిఫ్ట్‌ కు శ్రీకారం చుట్టారు. ఈ మహా కార్యాన్ని చంద్రబాబు ఆపేశారు. 
    చంద్రబాబుకు నీళ్లన్నా, రైతన్నా, పంట అన్నా ఇష్టం ఉండదు కాబట్టి ఆపేసినట్లుంది. తాను రహస్యంగా కలిసి మాట్లాడితే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ ఆపేశాడని రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. గతంలో 10 వేల క్యూసెక్యులతో ఉన్న పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామరŠాధ్యన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచారు. కానీ ఇప్పుడు ఆ 40 వేల క్యూసెక్కులు కూడా రాని పరిస్ధితి నెలకొంది. 840 టీఎంసీల కంటే తక్కువ నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉంటే పోతిరెడ్డి పాడు నుంచి చుక్క నీరు కూడా కిందకు రాదు. అదే జరిగితే పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, సోమశిల వంటి ప్రాజెక్టులు నీళ్లు లేక అలమటిస్తాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్‌ ఆపేయడం దారుణం. గతంలో బాబు హయాంలో రిజర్వాయర్‌ గా ఉన్న ఆల్మట్టి డ్యామ్‌ గా మారిపోయింది. దాన్ని ఇంకా పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.

రాయలసీమ లిఫ్ట్‌ కోసం పాదయాత్రకు సిద్ధం.
:ఆర్కే రోజా. మాజీ మంత్రి
.
– 800 అడుగుల వద్ద నీటిని వాడుకునే ఓ గొప్ప సాగునీటి పథకాన్ని జగనన్న తీసుకొస్తే దాన్ని ఆపేసిన కూటమి ప్రభుత్వాన్ని  అదే 800 అడుగుల లోతున పాతిపెట్టేందుకు రాయలసీమ  వాసులు సిద్దంగా ఉన్నారు. రాయలసీమకు ద్రోహం చేస్తే, ఇక్కడి ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించేందుకే మేం ఇక్కడ సమావేశమయ్యాం. రాష్ట్రంలో రైతుల కోసం, రాయలసీమ పొలాల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కేలా చేశారు. తండ్రీ ఒక అడుగు వేస్తే, ఆయన కుమారుడు జగనన్న రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు 70 –80 శాతం పనులు పూర్తి చేశారు.  ఇదే రాయలసీమలో పుట్టి, ఇక్కడి గాలి పీల్చి, తిండి తిని, ఇక్కడి ఓట్లతో గెలిచి నాలుగుసార్లు సీఎం అయి ఈ ప్రాజెక్టుకు ద్రోహం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సీమ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. రాయలసీమ వాసులంతా చంద్రబాబు ద్రోహాన్ని గుర్తు పెట్టుకుని బుద్ధి చెప్పాలని కోరుతున్నాం. పిల్లనిచ్చిన మామకైనా, జన్మనిచ్చిన రాయలసీమకైనా వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు.
    ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరింత ఉ«ధృతంగా ముందుకెళ్తుంది. ఇది అంతిమ దశకు వచ్చేలోపు రాయలసీమ లిఫ్ట్‌ కట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోతే, వాళ్లను కూకటి వేళ్లతో పెకిలీంచేందుకు రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విజన్‌ ఉందీ విస్తరాకుల కట్ట ఉందని చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తే పూర్తవుతుంది. కానీ అది ఇవ్వకుండా రూ.2 లక్షల కోట్లు పెట్టి అమరావతి కడతానని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. 

రాయలసీమ లిఫ్ట్‌ తోనే రత్నాల సీమ సాధ్యం.
:నారాయణస్వామి, మాజీ మంత్రి

–     రాజశేఖర్‌ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్‌ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్‌ రెడ్డిని దేశమంతా గుర్తించింది. అందుకే ప్రతీ ఒక్కరి గుండెల్లో రాజశేఖర్‌ రెడ్డి శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆ తర్వాత జగనన్న రైతుల గురించి ఎంతో ఆరాటంగా పనిచేశారు. రైతులు అంటేనే గిట్టని చంద్రబాబు ప్రాజెక్టులు కట్టకుండా నదుల్ని ఎడారులుగా మార్చాడు. జలయజ్ఞం తెచ్చిన వైఎస్సార్‌ కడుపున పుట్టిన జగన్మోహన్‌ రెడ్డి తన తండ్రి బాటలోనే ప్రాజెక్టుల్ని కట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి చంద్రబాబు ఎలా నాశనం చేశాడో అందరూ చూశారు. కాబట్టి జగన్మోహన్‌ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందే. రాయలసీమను తిరిగి రత్నాలసీమగా మార్చాలంటే జగనన్న పిలుపు ప్రకారం రాయలసీమ లిఫ్ట్‌ కోసం పోరాటాలు చేద్దాం.

రాయలసీమ లిఫ్ట్‌ కోసం త్వరలో కార్యాచరణ
:బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

– రాయలసీమ లిఫ్ట్‌ ను తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరుకుంటున్నారు. ఇందుకోసం ఓ కమిటీగా ఏర్పడి కార్యాచరణ తీసుకుందాం. రోజా గారు చెప్పినట్లు రాయలసీమ లిప్ట్‌ కోసం పాదయాత్ర చేపడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. పోతిరెడ్డిపాడు నుంచి తిరుపతి లేదా తిరుపతి నుంచి పోతిరెడ్డిపాడుకు పాదయాత్ర చేపట్టాలా అన్నది జగన్‌ వారి వద్ద కూర్చుని మాట్లాడుకుని ఖరారు చేస్తాం. రాయలసీమను కాదని గతంలో తెలుగు గంగకు నీళ్లు ఇచ్చాం. దీనిపై మేం అధికారంలో ఉండగా నేను పాదయాత్ర కూడా చేశాను. ఎన్టీఆర్‌ సినిమా వాళ్ల కోసం తెలుగు గంగ పేరుతో నీళ్లు త్యాగం చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమకు గుక్కెడు నీళ్లు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్‌ కు మొన్న పార్లమెంట్లో మాట్లాడిన రేణుకా చౌదరి పేరు పెట్టయినా చంద్రబాబు పూర్తి చేయాలి. జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనలు వందేళ్లు ముందుంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా జగనన్న చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ను పూర్తి చేయాలి.

Back to Top