మహిళపై అసభ్య పోస్టులు..

నిరసనకు దిగిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళలపై దాడి యత్నం  

తిరుపతి: సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కూటమి నాయకులు రెచ్చిపోయారని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నాయకులు ఆరోపించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉపాధ్యక్షురాలు విజ‌య‌ల‌క్ష్మిపై బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెట్టారని మండిపడ్డారు.
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా నేడు తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన చేస్తున్న మహిళలపై కూటమి నేతలు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోకుండా, నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళలను పోలీసులు స్టేషన్‌కు తరలించడం అన్యాయమని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
 

Back to Top