గుంటూరు జిల్లా: ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం భారీగా నిర్వహించారు. జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు రోహిత్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు తనీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబు, పార్టీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజా సమస్యలు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను నాయకులు అభినందిస్తూ.. రాబోయే రోజుల్లో మరింత సమన్వయంతో పనిచేసి వైయస్ఆర్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.