ఏపీ మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే

లేదా రిటర్న్‌ గిఫ్ట్‌ కోసం రాధాకృష్ణ సిద్ధంగా ఉండాలి

వంగవీటి నరేంద్ర, నాగార్జునయాదవ్, పుణ్యశీల వార్నింగ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధులు వంగవీటి నరేంద్ర, యనమల నాగార్జునయాదవ్, ఏపీఐడీసీ మాజీ ఛైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల.

తాడేపల్లి: ఏపీ మహిళలకు ఏబీఎన్‌ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందేనని, లేదా రిటర్న్‌ గిఫ్ట్‌ తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర, యనమల నాగార్జునయాదవ్, బండి పుణ్యశీల హెచ్చరించారు. భార్యను చెల్లి అనుకుని మరో పెళ్లి చేయాలనే రాధాకృష్ణ వ్యాఖ్యలు అత్యంత హేయమని, ఆయన జర్నలిస్టుగా ఏనాడో పతనం కాగా, ఇప్పుడు కనీసం మనిషిగా కూడా మిగల్లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు చురకలంటించారు.
ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

జర్నలిస్టు ముసుగులో రాధాకృష్ణ దుర్మార్గపు రాతలు.
:వంగవీటి నరేంద్ర. వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి 

– జర్నలిజం అంటే ఎవరైనా గౌరవిస్తారు. కానీ మహిళలను కించపరుస్తూ నీచమైన రాతలు చేసేవారిని ఎవరైనా జర్నలిస్టులు అంటారా? జర్నలిస్టు ముసుగులో రాధాకృష్ణ దుర్మార్గపు రాతలు రాస్తున్నాడు. ఇతన్ని జర్నలిస్టుగా భావించవద్దు. ఏబీఎన్‌ రాధాకృష్ణ తుచ్చమైన, నీచమైన వైఖరిపై మేం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మహిళలను దారుణంగా కించపర్చేలా రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి. రాధాకృష్ణకు ఉచ్చనీచాలు తెలియవు. ఆయనకు తన కుటుంబ సభ్యులపై కూడా గౌరవం లేదు. జర్నలిజం ముసుగులో చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌ రాతలు ఆపకపోతే మేం నిరసన ఆపం. నిజంగా మేం ప్రత్యక్ష ఆందోళనకు దిగితే నీ కార్యాలయం, కార్లు ధ్వంసం అయ్యేవి. ఇప్పటికైనా క్షమాపణలు చెబితే సరి, లేకపోతే ఎక్కడ దాక్కున్నా బుద్ధి చెబుతాం.

జర్నలిస్టుగా రాధాకృష్ణ ఎప్పుడో పతనమయ్యాడు.
:వై.నాగార్జునయాదవ్‌. వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి

– చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్‌ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు. కనీస సభ్యత, సంస్కారం లేకుండా పత్రికలు నడుపుతున్నారు. మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ పెన్నుతో రాశాడా? పెగ్గు వేసుకుని రాశాడా? రాధాకృష్ణ అంత దారుణ వ్యాఖ్యలు చేసినా, మా పార్టీ శ్రేణులు సంయమనం పాటించి, కేవలం నిరసన వ్యక్తం చేస్తే.. దాడి చేశారని అక్కడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఛానల్‌ ఆఫీస్‌పై మా పార్టీ దాడి చేయలేదు. జర్నలిస్టుగా ఏనాడో పూర్తిగా పతనమైన రాధాకృష్ణ, చివరకు ఇప్పుడు కనీసం మనిషిగా కూడా మిగల్లేదు. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే విశ్వరూపం చూపిస్తాం.
:బండి పుణ్యశీల. ఏపీఐడీసీ మాజీ ఛైర్‌పర్సన్‌.

– నిత్యం చంద్రబాబు జపం చేస్తూ, ఆయనకు జాకీలు ఎత్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ అణువణువునా కులగజ్జి పులుముకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జగన్‌గారు మావిగన్‌ అనే గన్‌షాట్‌ వదిలారు. అది వారికి తూటాల్లా తగిలింది. వైయస్‌ జగన్‌ విజన్‌తో గొప్ప రాజధానిని నిర్మించవచ్చు అనే ఆలోచన చెప్పగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే గతి తప్పి వ్యాఖ్యలు. అసలు వైయ‌స్ఆర్‌సీపీ మహిళలు, మా నాయకుల భార్యలు నీకు చేసిన అపకారం ఏంటి రాధాకృష్ణ?. కులగజ్జితో ఒక వ్యక్తిని ద్వేషించడం, అతని పతనాన్ని కోరుకోవడం నీ నీచమైన బుద్ధికి నిదర్శనం. ఒక మహిళ కడుపున పుట్టిన వ్యక్తిగా రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే విశ్వరూపం చూపిస్తాం. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం.

Back to Top