సహకార ఎన్నికల్లో సత్తా చాటాలి


ప్రకాశం జిల్లా:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ పెరిగిందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని నిర్దోషిగా భావిస్తున్న ప్రజలు ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తన స్వగ్రామమైన మేదరమెట్లలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సెంటర్‌లోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని అనమనమూరులో గ్రామదేవత అంకమ్మతల్లికి పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో పార్టీ పటిష్టత, సహకార ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి చర్చించారు. సహకార ఎన్నికల్లో పార్టీ నిలిపిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Back to Top