అంతులేని టీడీపీ భూ దోపిడీ

విజయవాడ : రాజధాని ప్రాంతంలో టీడీపీ భూ దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా రైతుల భూములను దోచుకొని బాబు బ్యాచ్ విదేశీ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. భూములివ్వం మొర్రో అని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటున్నా వినకుండా భయపెట్టి, బెదిరించి భూములను దోపిడీ చేస్తోంది. 

తాజాగా మరోసారి, రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణకు  నోటిఫికేషన్ జారీ అయ్యింది. ల్యాండ్ పూలింగ్ కు భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు లాక్కొనేందుకు సిద్ధమైంది. నేలపాడు గ్రామానికి చెందిన 27 ఎకరాల భూసేకరణకు గుంటూరు జిల్లా కలెకర్ట్ భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ తీరుపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. తమ భూముల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. 
Back to Top