పత్రికలు, ఛానళ్లపై కక్షసాధింపు తగదు

విజయనగరం: రాష్ట్రంలో  చంద్రబాబునాయుడు నియంత పాలన కొనసాగిస్తున్నారని వైయస్సార్‌సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందువల్లే  టీడీపీ నాయకులు ఎంఎస్‌ఓలపై ఒత్తిడి తీసుకువచ్చి సాక్షి ఛానళ్ల ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఛానల్‌ ప్రసారాలు నిలిపివేసినంత మాత్రాన ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రజలకు తెలియవనుకోవడం అవివేకమన్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారన్నారు. పత్రికలు, టీవీ ఛానళ్లపై వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపులు చేపట్టడం తగదన్నారు. బాబు, ఆయన అనుచరులకు వంతపాడే ఛానళ్లు, పత్రికలకు లబ్ధి చేకూర్చడం కోసమే సాక్షిపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిలిపివేసిన సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 

Back to Top