కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్లోని వైయస్ ఆర్ సీపీ  కేంద్రకార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ సీనియర్‌ నేతలు విజయ్‌ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైయస్ వివేకానంద రెడ్డి ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విజయవాడ  రాష్ట్ర కార్యాలయంలో : విజయవాడలోని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు స్థాయి ప్రజల వరకు కూడా రాజ్యాంగ ఫలాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సంక్షేమాన్ని ప్రజలకు మరింతచేరువ చేసే లక్ష్యంతోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారన్నారు. 
పలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు కె.పార్థసారథి, ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
Back to Top