వైయస్ జగన్ ను ఎదుర్కోలేక పిచ్చికూతలు

– వదిన గొంతు నొక్కి చంపిన చరిత్ర దేవినేని ఉమది
– మహిళలను విమర్శిస్తే రెండు చెంపలు వాయిస్తారు 
– దేవినేని తన ప్రతాపం సామాన్యులపై చూపించడం తగదు 
– దమ్ముంటే వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలి
– పౌరుషముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలి
– విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమపై వాసిరెడ్డి పద్మ ధ్వజం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శిస్తే సొంత నియోజకవర్గంలోని మహిళలే దేవినేని ఉమ రెండు చెంపలు వాయిస్తారాని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ప్రతిపక్ష నాయకుడున్న కనీసం మర్యాద లేకుండా పిచ్చిపట్టినట్లు మాట్లాడితే సహించబోమని దేవినేని ఉమను హెచ్చరించారు.  టీడీపీ నాయకుల్లా మేము దిగజారి మాట్లాడబోమని హుందాగా వ్యవహరిస్తామని తెలిపారు. వైయస్‌ జగన్‌ను తొక్కి పట్టి నారతీస్తామన్న దేవినేని ఉమ మాటలకు ఆమె తీవ్రంగా స్పందించారు. తల్లి పాలు తాగే పెరిగావా అని ప్రశ్నించారు. ఉమ ప్రవర్తన, మాటలు చూస్తుంటే మానసిక రోగిలా అయిపోయాడనిపిస్తోందని ఏదైనా మంచి ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని సూచించారు. వైయస్‌ జగన్‌ తమ నియోజకవర్గాలకు వస్తుంటే టీడీపీ నాయకులకు వణుకు పుడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. పోలవరం పనుల్లో కమిషన్లను నిలదీస్తున్నారని ఆదాయం తగ్గిపోతుందని ఉమ అల్లాడిపోతున్నారని విమర్శించారు. 

హత్యా రాజకీయాలకు మీకు కొత్తకాదు
టీడీపీ నాయకులకు హత్యా రాజకీయాలు కొత్తేమీ కాదని ఆనాడు అధికారం కోసం దేవినేని ఉమ సొంత వదిననే పైకి పంపిన చరిత్ర కృష్ణా జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు.  కృష్ణా నీరు తాగిన వ్యక్తికి ఇలాంటి మాటలెలా వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. టీడీపీలో మహిళలు ఎదుగుతుంటే చూడలేరని ఆ పార్టీలు వారినెప్పటికీ వంటింటి వస్తువులుగానే చూస్తారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ మాత్రం సామాన్య మహిళలను కూడా సింహంలా నిలబెట్టే సత్తా ఉన్నోడని ప్రశంసించారు. దేవినేని ఉమ మహిళలను  నోటికొచ్చినట్లు విమర్శిస్తే సొంత నియోజకవర్గంలోనే రెండు చెంపలు వాయిస్తారని ఒళ్లు హద్దుల్లో ఉంచుకోవాలని చురకలంటించారు. టీడీపీ నాయకులకు మహిళలను కాల్‌నాగుల్లా కాటేయడమే తెలుసన్నారు. కుట్రలు, మోసాలు టీడీపీ నాయకుల రక్తంలోనే ఉందన్నారు. మీ అధినేత చంద్రబాబు నుంచి నీ వరకు అందరూ కుట్రలు, వెన్నుపోటు పొడిచి హత్యారాజకీయాలతో పైకొచ్చినవారేనని అన్నారు. ఉమ మాటలు ఉన్నాదిలా హత్యా రాజకీయాలను ప్రేరేపించేవిగా ఉన్నాయని వాసిరెడ్డి పద్మ ఆక్షేపించారు. 

దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలువ్‌
ఉమ మంత్రి పదవి వెలగబెడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడ్డం కాదని దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్న 20 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా కూడా లేక రాజీనామా చేయించలేని పిరికి సన్నాసులు టీడీపీ నాయకులు అని దుయ్యబట్టారు. కార్లు తగలబెట్టినా, పొలాలు తగలబెట్టినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అధికార మదంతో ఇష్టమొచ్చినట్లు అమాయకులను వేధించడం తప్ప ప్రజలకు మేలు చేసే యోచన ఏదీ టీడీపీ నాయకులకు లేనే లేదన్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌కు కేసులంటే భయమే లేదన్నారు. సోనియా, మోడీలకు లొంగే వాడే అయితే ఈపాటికీ ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. అధికారం, డబ్బు, కేసులకు భయపడి సాగిలాపడటం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఏనాడైనా వారి పక్షాన పోరాడారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రధానికి వైయస్‌ జగన్‌ రాసిన లేఖలు గుర్తులేవా అన్నారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టిన నీచమైన ఘనత చంద్రబాబుదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 

రాజధానిలో రైతుల పొలాలు తగలబెట్టడం, తునిలో రైలుకు నిప్పు పెట్టి వైయస్‌ జగన్‌పైకి నెట్టే కుట్రలు చేయడం వంటి విష సంస్కృతి తప్ప ప్రజా సేవ చేద్దామనే ధ్యేయం టీడీపీకి లేదన్నారు. దమ్ముంటే ఆయా కేసులపై విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. తాము చెప్పినట్టు వినలేదని ఎస్పీ రామకృష్ణను బదిలీ చేయించడానికి కూడా టీడీపీ నాయకులు దిగజారిపోయారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రాజకీయంగా వైయస్‌ జగన్‌ను ఎదుర్కోవడం చేతకాక అసెంబ్లీకి కూడా రావద్దని చెప్పడం సిగ్గుచేటన్నారు. అమరావతి నిర్మిస్తామంటే మా నాయకుడు వైయస్‌ జగన్‌ సహకరిస్తానని చెప్పిన విషయాన్ని ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు. గాలి, ధూళి మన్ను మశానం అందరూ టీడీపీ పార్టీలోనే ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. 
Back to Top