నవంబర్ 5లోపు ఓటరుగా నమోదు చేసుకోండి

నెల్లూరుః 2013లోపు గ్రాడ్యుయేట్, డిప్లొమా పూర్తి చేసిన పట్టభద్రులు అందరూ నవంబర్ 5లోపు శాసనమండలి పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. స్థానిక రాజన్నభవన్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎవరైతే యువతకు మేలు చేస్తారో వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికార టీడీపీ విద్యాసంస్థల్లో యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రలోభపెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అలాంటి వారికి ఓటు వేయకుండా ఆలోచించి, నీతిపరులైన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ తదితర వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 

Back to Top