ముస్లింలకు వైయస్ జగన్ రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్‌
ముబారక్‌) తెలిపారు.మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే
కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష
మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ
రంజాన్‌ అని జగన్‌ అన్నారు.

నెలరోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక
ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు
తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన తెలిపారు.

రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృ
త్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని జగన్‌ ఆకాంక్షించారు. తెలుగు
రాష్ట్రాల ప్రజలందరికీ ఆ అల్లాహ్‌ చల్లని దీవెనలు నిరంతరం ఉండాలని, ప్రతి ఇంటా ఆనందాలు
వెల్లివిరియాలని జగన్‌ ప్రార్థించారు.
Back to Top