భూములు వెన‌క్కి ఇప్పిస్తాంశ్రీకాళహస్తి:  విమానాశ్ర‌యం కోసం ప్ర‌భుత్వం పేద‌ల నుంచి తీసుకున్న భూమిని తిరిగి వెన‌క్కి ఇప్పిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన రామ్మూర్తి కలిసి.. తన సమస్యను విన్నవించుకున్నారు. రామ్మూర్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. విమానాశ్రయ నిర్మాణం కోసం ఆయన భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కొంది. దీంతో భూమి కోల్పోయిన ఆయనకు కనీసం సరైన పరిహారం కూడా ఇవ్వలేదు. దీనిపై అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టులకు వెళ్లినా లాభం లేకపోయింది. దీంతో పాదయాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ను కలిసి.. సహాయం చేయాల్సిందిగా రామ్మూర్తి అభ్యర్థించారు. స్పందించిన వైయ‌స్‌ జగన్ మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ రికార్డుల‌ను ప్ర‌క్షాళ‌న చేయిస్తాన‌ని, తప్పు చేసిన అధికారుల‌ను ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం తీసుకున్న భూములను వెన‌క్కి ఇప్పిస్తామ‌ని మాట ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో రామ్మూర్తి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  
Back to Top