వైయ‌స్‌ఆర్‌సీపీ యూత్ జిల్లా కార్యదర్శిగా రాకెట్‌ రఫీ

వైయస్ఆర్ కడప: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన రాకెట్‌ రఫీ నియమితులయ్యారు. గురువారం మైదుకూరు, కడప ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు యువజన విభాగం పాత్ర కీలకమన్నారు. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి యువజన విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం రాకెట్‌ రఫీ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రాజశేఖర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంటు శివశంకర్, జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్, జి. మధువర్థన్‌రెడ్డి, రాకెట్‌ ఆలం, దస్తగిరి, న రేంద్ర, చెండ్రాయుడు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top