రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం

హైదరాబాద్ 2 డిసెంబర్ 2012 : ఎస్.సి,ఎస్.టి.సబ్‌ప్లాన్ చట్టబద్ధత ప్రక్రియ అంతా ప్రణాళికాసంఘ మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా జరుగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ (సీజీసీ) సభ్యుడు, ఎం.ఎల్.సి జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్.సి, ఎస్.టి.ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే విధానం లోపభూయిష్ఠంగా ఉందని అభ్యంతరం తెలిపారు. ఇది సారమంతా తీసేసిన ప్రాణం లేని బిల్లు మాత్రమేనన్నారు.

Back to Top