పేద‌ల కోస‌మే రాజన్న రైతు బజార్‌...


 గుంటూరుః పేద‌ల కోస‌మే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరుతో రాజ‌న్న రైతు బ‌జార్ ఏర్పాటు చేశామ‌ని మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  పేర్కొన్నారు. ఈ రైతు బ‌జార్ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని ఆయ‌న తెలిపారు. రాజన్న రైతు బజార్‌ ప్రారంభించి పేదలకు 10 రూపాయలకే కూరగాయలు అందిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పటికే రాజన్న క్యాంటిన్లు ఏర్పాటుచేసి రూ.4కే భోజనం అందిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల మరో అడుగు మందుకేశారు.పేద ప్రజలు వారం రోజులు పాటు కూరగాయాలతో భోజనం చేసేవిధంగా రైతు బజార్‌ను ప్రారంభించారు. మంగళగిరి 22వ వార్డు రత్నాల చెరువు వద్ద  ప్రారంభించారు.రైతు బజార్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ఆదివారం ఒకరోజే సుమారు 800 కుటుంబాలు కూరగాయాలు కొనుగోలు చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ రైతు బజార్‌కు పునరవైభవం తీసుకొస్తానని చంద్రబాబు మేనిఫెస్టో 43వ పేజీల్లో స్పష్టంగా పేర్కొన్నారని,కూరగాయలను ప్రతి సామాన్యుడికి అందేలా ధరలను నియంత్రిస్తానని పేర్కొన్నారని నాలుగున్నరేళ్లు అవుతున్న చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేయలేదన్నారు.రాజధానిలోనే పేదలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
 

Back to Top