పాద‌యాత్ర‌కు వ‌ర్షం అంత‌రాయంతూర్పు గోదావ‌రి: వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర మార్నింగ్ సెషన్ రద్దయినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నానికి వర్షం ఆగితే పాదయాత్రను వైయ‌స్‌ జగన్‌ కొనసాగిస్తారని తెలిపారు. ఈ రోజు జరిగే సోషల్‌ మీడియా వాలంటీర్ల సమావేశం కూడా రద్దయినట్లు ఆయన పేర్కొన్నారు.  రేపు యధాతథంగా వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

Back to Top